- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి : ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా
దిశ, జైనూర్ : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు

దిశ, జైనూర్ : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, విద్యార్థులకు అవసరమైన ఐరన్, సి విటమిన్ టాబ్లెట్లను అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు.
వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు వంటశాల, స్టోర్ రూమ్, త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. విధులలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.






