ప్రైవేట్, కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి : పొడపంగి.నాగరాజు

by Batti.Sumithra |

ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విద్యను వ్యాపారంగా మారుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిని అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి.

ప్రైవేట్, కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి : పొడపంగి.నాగరాజు
X

దిశ, మంచిర్యాల : ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విద్యను వ్యాపారంగా మారుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిని అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి. నాగరాజు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవనంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదన్నారు. ఎస్.ఎస్.సీ, ఇంటర్మీడియట్ బోర్డు సెలవులను ప్రభుత్వం జూన్ 12 వరకు సెలవులు ప్రకటించిందని, వేసవి సెలవులలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్క్యులర్ విడుదల చేసినప్పటికీ ప్రైవేట్ అడ్మిషన్ల దోపిడిని అధికారులు ఆపలేక పోతున్నారని ఆరోపించారు.

వచ్చే విద్యాసంవత్సరం 2026-27 సంబంధించిన అడ్మిషన్లను కాని చేస్తున్నారని అన్నారు. బాహాటంగానే బోర్డులు పెట్టి ప్రచారాలు జోరుగా చేస్తున్నారని అన్నారు. జిల్లాలో టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్, జీనియస్, ఇంటర్నేషనల్ పేరుతో కొనసాగుతూ విద్యను వ్యాపారమే లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్, పి.సికిందర్, కే.కార్తీక్, సహాయ కార్యదర్శి సంజయ్.కుమార్, వంశీ, కోశాధికారి సౌమ్య, నాయకులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Next Story