- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మల్ కు దుబాయ్ యువరాజు..?
దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి దుబాయ్ యువరాజు వస్తున్నారని బుధవారం పొద్దున నుంచి ప్రచారం మొదలైంది. ఆ స్థాయిలో దుబాయ్ యువరాజును పోలి ఉన్న ఫ్లెక్సీలు పెద్ద

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి దుబాయ్ యువరాజు వస్తున్నారని బుధవారం పొద్దున నుంచి ప్రచారం మొదలైంది. ఆ స్థాయిలో దుబాయ్ యువరాజును పోలి ఉన్న ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిశాయి. వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బి గ్రామానికి చెందిన తడక చంద్రశేఖర్, విజయ్ ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరూ కొన్నేళ్లుగా గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. అక్కడే వీరి తో దుబాయ్ కి చెందిన మొహమ్మద్ అబ్దుల్లా మొహసిన్ అనే యువ వ్యాపారవేత్తతో సంబంధాలు పెరిగాయి. చంద్రశేఖర్ తో కలిసి 21 సంవత్సరాలు ఆ వ్యాపారవేత్త సంబంధాలు కలిగి ఉన్నారు. తాజాగా సారంగపూర్ మండలంలోని చంద్రశేఖర్ సోదరులు సొంతగా పెట్రోల్ పంపు ఏర్పాటు చేశారు. బుధవారం ప్రారంభోత్సవం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి దుబాయి నుండి తమ మిత్రుడిని ఆహ్వానించారు. ఇండియా మిత్రుల ఆహ్వానం మేరకు యువ వ్యాపారవేత్త దుబాయ్ నుండి నిర్మల్ వచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. కాగా దుబాయ్ షేక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిత్రుత్వానికి ప్రత్యేకత ఆయన నిలిచారని... దుబాయ్ నుండి మిత్రుడు కొత్త వ్యాపారం ప్రారంభోత్సవానికి హాజరు కావడం గొప్ప విషయం అంటూ స్థానికులు కొనియాడారు.






