- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంటను అంటుకున్న విద్యుత్ తీగలు..!
by Batti.Sumithra |
కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుండడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయని రైతులు అంటున్నారు.

X
దిశ, కుబీర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుండడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయని రైతులు అంటున్నారు. జంగాం గ్రామంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు ఓ రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటను తాకే విధంగా కనిపిస్తున్నాయి. సుడిగాలులకు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పు చెలరేగితే పంట కాలి బూడిద కావడం ఖాయమని భయపడుతున్నారు. మండలంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరిగి మొక్కజొన్న పంట దగ్ధమైన సందర్భాలు ఉన్నాయి. గ్రామాల్లోనూ, వ్యవసాయ క్షేత్రాల్లోనూ కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదానికి నిలయంగా మారుతున్నాయి. వీటిని సంబంధిత శాఖ అధికారులు వెంటనే సరిచేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






