ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

by Ratna Kumari |

నిర్మల్ జిల్లా ఖానాపూర్ బల్దియా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి.

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
X

దిశ‌, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ బల్దియా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సోమవారం అధికారులు పోలీస్ బందోబస్త్ తో ఏర్పాట్లు చేశారు. సోమవారం పదకొండు గంటలకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండగా మధ్యాహ్నం 1:30 వరకు కౌన్సిలర్లు పూర్తిస్థాయిలో ఎన్నికల కేంద్రానికి రాలేకపోయారు. ఫోరమ్ లేకపోవడంతో రేప‌టికి చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు స్పెషల్ ఆఫీసర్, ముఖ్య ప్రణాళిక అధికారి వెల్లడించారు . కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తో కలిసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఎన్నికల కేంద్రంలోకి వెళ్లారు. హాజరైన కాంగ్రెస్ అభ్యర్థులు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. చైర్మన్ ఎన్నికకు 1/3 సభ్యుల హాజరు తప్పనిసరి. అయితే బీఆర్ఎస్ కి చెందిన న‌లుగురు, బీజేపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు క్యాంపుల నుంచి ఎన్నికల కేంద్రానికి రాలేకపోయారు. నూతనంగా ఎన్నికైన సదరు కౌన్సిలర్లు ఎన్నిక కేంద్రానికి రాకపోవడంతో ఖానాపూర్ మున్సిపాలిటి చైర్మన్ ఎన్నికల రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీని ఓడించే ఆలోచనతో బీఆర్ఎస్, బీజేపీలో ఒకటయ్యాయి. అయితే చైర్మన్ పదవి విషయంలో ఈ రెండు పార్టీల నడుమ సమన్వయం కుదరకపోవడంతో సోమవారం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నూతన ఎన్నికైన బీజేపీ, బీఆర్ఎస్ (అభ్యర్థులు )కౌన్సిలర్లు హాజరు కాలేకపోయారు. మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మున్సిపల్ ఎన్నికల కేంద్రానికి రాకపోవడంతో అధికారులు చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story