- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్షసాధింపు : ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పక్కదారి పట్టించేందుకు సిట్ పేరిట బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు.

దిశ, ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పక్కదారి పట్టించేందుకు సిట్ పేరిట బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయటాన్ని నిరసిస్తూ ఆదివారం ఆసిఫాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ ఎదుట నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దొంగహామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల్లో ఇచ్చి హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని చెప్పారు. ఇటూ టీబ్లూఆర్ టాక్స్ పేరిట వేల కోట్ల రూపాయలు దడ్డుకుంటున్న రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్న తమ బీఆర్ఎస్ నేతల పై రాజకీయ కక్షసాధింపు కోసం సంబంధంలేని ఫోన్ ట్యాపింగ్ కేసును అక్రమంగా బనాయించి. కాంగ్రెస్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేస్తే. రేవంత్ సర్కార్ రెండేళ్లలో దాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.






