రౌడీ షీట్లర్లకు పోలీసుల హెచ్చరిక

by Ratna Kumari |

రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తామని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై శ్రీధర్ హెచ్చరించారు.

రౌడీ షీట్లర్లకు పోలీసుల హెచ్చరిక
X

దిశ, రామకృష్ణాపూర్ : రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తామని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై శ్రీధర్ హెచ్చరించారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ లో రౌడీషీటర్లకు ఆయన కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో రౌడీషీటర్లలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. రౌడీషీటర్ల నేరచరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం తెలుసుకున్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో ఉండాలని వివాదాలు, బెదిరింపులు,చట్ట వ్యతిరేక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో సత్ప్రవర్తన కలిగి మీ పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ సమాజానికి తమవంతు సహాయ సహకారం అందించాలని కోరుతూ సత్ప్రవర్తన కలిగిన వారు పేర్లు రౌడీషీటర్ల నుంచి తొలగిస్తామని ఎస్సై శ్రీధర్ తెలిపారు.

Next Story