డోర్ ఎఫ్ఐఆర్ తో బాధితులకు మరింత సులువుగా పోలీస్ సేవలు

by Batti.Sumithra |

జిల్లాలో ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా పోలీస్ సేవలను అందించేందుకు Onsite డోర్ ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు.

డోర్ ఎఫ్ఐఆర్ తో బాధితులకు మరింత సులువుగా పోలీస్ సేవలు
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా పోలీస్ సేవలను అందించేందుకు Onsite డోర్ ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. హత్యాయత్నం, అత్యాచార యత్నం, దోపిడీ, చోరీ, మహిళలు-చిన్నారుల పై నేరాలు, తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ కేసులు, బాల్యవివాహాలతో పాటు ర్యాగింగ్ వంటి ఘటనల్లో పోలీస్ స్టేషన్ వెళ్లకుండా..! బాధితులు ఉన్న ప్రదేశానికే వెళ్లి పోలీసు, అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని చెప్పారు. సంఘటనా స్థలంలోనే కేసు నమోదు చేయడం వల్ల ఆధారాలు వేగంగా సేకరించడంతో పాటు నిందితులను త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సేవ గ్రామీణ ప్రాంత ప్రజలు, బాధిత మహిళలు, వృద్ధులకు ఎంతో ఉపయోగకరమని, బాధితులకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యమన్నారు. ఎలాంటి సంఘటన జరిగినా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని లేదా 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Next Story