- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించండి.. మంత్రికి వినతి పత్రం అందజేత
నియోజకవర్గంలో మొక్కజొన్న పంటను విస్తారంగా రైతులు సాగు చేశారని కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దిశ, ప్రతినిధి నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో మొక్కజొన్న పంటను విస్తారంగా రైతులు సాగు చేశారని కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం పది కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుందని పేర్కొన్నారు. స్పందించిన మంత్రి మొదటి విడతగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జొన్న పంట కొనుగోలు రాష్ట్రంలో ఎక్కడ కేంద్రాలు ప్రారంభించలేదని, త్వరలోనే నిర్మల్ జిల్లాలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన రాష్ట్ర మంత్రికి శ్రీహరి రావు ధన్యవాదాలు తెలిపారు.






