తూతూ మంత్రంగా తనిఖీలు.. అస్తవ్యస్తంగా పనులు..!

by Batti.Sumithra |

గ్రామాల్లో మండల స్థాయి అధికారులు తూతూ మంత్రంగా పరిశీలనలు చేస్తుండడంతో పంచాయతీల్లో పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.

తూతూ మంత్రంగా తనిఖీలు.. అస్తవ్యస్తంగా పనులు..!
X

దిశ, కుబీర్ : గ్రామాల్లో మండల స్థాయి అధికారులు తూతూ మంత్రంగా పరిశీలనలు చేస్తుండడంతో పంచాయతీల్లో పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. నర్సరీల నిర్వహణ, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు మండల స్థాయి అధికారుల పరిశీలన లోపం వల్లే అధ్వాన్నంగా మారుతున్నాయని గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జూమ్డా, రాజురా, వీర్గం గ్రామాల్లో జరిగిన పనులను పరిశీలిస్తే జిల్లా అధికారులు ఆశ్చర్యపోవాల్సిందేనని అంటున్నారు.

రాజురా నర్సరీలో మొక్కలు లేని ఖాళీ బెడ్లు, నాశనం చేసిన పల్లె ప్రకృతి వనం చెట్లు, జూమ్డాలో అస్తవ్యస్తంగా ఉన్న వైకుంఠధామ పనులు, సెగ్రిగేషన్ షెడ్లు, వీర్గంలో ఫెన్సింగ్ లేని నర్సరీ పెంపకం పనులు చూస్తే తనిఖీ చేసే అధికారుల పనితీరు స్పష్టంగా తెలుస్తుందని ప్రజలు అంటున్నారు. పనిచేసే పంచాయతీ సెక్రటరీల పనితీరును పర్యవేక్షించే స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీవోలు ఈ పరిస్థితిని గమనించలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు పనులను సమగ్రంగా పరిశీలించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story