ప్రజలు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి : ఎస్పీ నితిక పంత్

by Batti.Sumithra |

ప్రజలు తమ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు.

ప్రజలు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి : ఎస్పీ నితిక పంత్
X

దిశ, ఆసిఫాబాద్ : ప్రజలు తమ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. ఆదివారం కెరమెరి మండలంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ. సన్ షైన్ హాస్పిటల్ మంచిర్యాల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రజలు తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమకున్న సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న..తమ పోలీసులు అందుబాటులో ఉండి పరిష్కారిస్తారని పేర్కొన్నారు. ఇక వైద్యశిబిరంలలో 900 మందికి రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. 50 మందికి కంటి అద్దాలు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ. ఎస్ఐలు మధుకర్. మహేందర్ పాల్గొన్నారు.

Next Story