- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్ : విచారణలలోనే విస్మయం.. పింఛన్ల పంపిణీ అవకతకులపై విచారణ
మండలంలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పంపిణీ చేసిన పింఛన్లలలో అవకతవకలు జరిగాయని దిశపత్రికలో వచ్చిన కథనంపై శుక్రవారం డీఆర్‌డీఏ అధికారులు విచారణ జరిపారు.

దిశ, కన్నెపల్లి : మండలంలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పంపిణీ చేసిన పింఛన్లలలో అవకతవకలు జరిగాయని దిశపత్రికలో వచ్చిన కథనంపై శుక్రవారం డీఆర్‌డీఏ అధికారులు విచారణ జరిపారు. విచారణలో అధికారులు మాట్లాడుతూ విధులపట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగానే లబ్ధిదారులకు పింఛన్ పంపిణీలో 2000 రూపాయలు పంపిణీ చేసి 16 రూపాయలు బిపీఎంలు ఇవ్వడం లేదని లబ్ధిదారులు కొంతమంది విచారణ అధికారులకు తెలిపారు. మండలంలోని వెంకటాపూర్, తంగళ్ళపల్లి, సుర్జాపూర్ గ్రామాలలో ఎపిఓ పెన్షన్ల విచారణ అధికారి అబ్దుల్ సలీం తన బృందంతో పింఛన్ల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యదర్శిలు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సమావేశానికి పంచాయతీ కార్యదర్శులు 15 మందికి గాను ముగ్గురి హాజరవడంపై నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
మండలంలో పెన్షన్లను పంపిణీ చేసేటప్పుడు బిపిఎంలో అందరూ లబ్ధిదారులకు 16 రూపాయలు చెల్లించకుండా ప్రభుత్వ సొమ్ము కాజేయడం సరికాదని చిల్లర లేవన్న సాకుతో మరో చర్యలకు పాల్పడితే మీ శాఖల ఉన్నతాధికారులకు చర్యల కోసం సిపారసు లేఖలు రాస్తామని హెచ్చరించారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు తప్పనిసరిగా 2016 ఇవ్వాల్సిందేనని బిపిఎంలకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో మీరు వేలిముద్రలు పెట్టి మిషన్ ద్వారా తీసిన అమౌంట్ ని పెన్షనర్లకు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఇటువంటి చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు.
విచారణ మొత్తంగా అధికారుల నిర్లక్ష్య వైఖరి పై అసహనం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యదర్శి నుండి వారి వివరణను రాతపూర్వకంగా తీసుకొని విచారణ పూర్తిచేసి నివేదికను జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు పంపిస్తామని తెలిపారు. వారి వెంట డిఆర్డీఏ ఏపిఎం శ్రీనివాస్, డిఆర్డీఏ హెచ్ఆర్ మేనేజర్ రమేష్, ఎపిఓ అశోక్ బిపిఎంలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు






