దిశ ఎఫెక్ట్: భీమిని మండలంలో పెన్షన్స్ ఎంక్వైరీ అధికారుల విచారణ

by Bhanu |

మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో పింఛన్ చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బిపిఎంలు ప్రతి లబ్ధిదారుడి నుండి రూ. 10 నుంచి రూ. 16 రూపాయల చొప్పున దర్జాగా వసూలు చేస్తున్నారని కథనాన్ని మార్చి 23 న దిశ పత్రికలో శీర్షిక కథనం ప్రచురితమైంది.

దిశ ఎఫెక్ట్: భీమిని మండలంలో పెన్షన్స్ ఎంక్వైరీ అధికారుల విచారణ
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో పింఛన్ చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బిపిఎంలు ప్రతి లబ్ధిదారుడి నుండి రూ. 10 నుంచి రూ. 16 రూపాయల చొప్పున దర్జాగా వసూలు చేస్తున్నారని కథనాన్ని మార్చి 23 న దిశ పత్రికలో శీర్షిక కథనం ప్రచురితమైంది. దీంతో ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. భీమిని మండలం చిన్నగుడిపేట, భీమిని, కన్నెపల్లి మండలంలోని సుర్జాపూర్, మెట్పల్లి గ్రామాలలో అధికారులు విచారణ చేపట్టినట్లు జిల్లా డి.ఆర్. డి.ఏ అధికారులు తెలిపారు.


జిల్లా ఏ.పీ.ఓ పెన్షన్ ఎంక్వైరీ అధికారులు ఎం.డి అబ్దుల్ సలీం ఆధ్వర్యంలో గురువారం భీమిని మండలంలో విచారణ చేపట్టారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బి.పి.ఎం, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి పెన్షన్ అవకతవకలపై చర్చించారు. అనంతరం భీమిని, చిన్నగుడిపేట గ్రామాలలో విచారణ కొనసాగించారు. లబ్ధిదారుల నుండి వివరాలు సేకరించారు. బి.పి.ఎం లు పెన్షన్ లబ్ధిదారుల నుండి రూ.16 ఇస్తున్నారా లేదా అంశాలను లబ్ధిదారుల నుండి తెలుసుకొని వారి పేర్లను నమోదు చేశారు.

నేడు కన్నెపల్లి మండలంలోని సుర్జాపూర్, మెట్పల్లి గ్రామాలలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్ కు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. ఆర్.డి.ఏ. హెచ్.ఆర్ మేనేజర్ రమేష్, డి.ఆర్.డి.ఏ ఏ.పీ.ఎం. శ్రీనివాస్, భీమిని ఎం.పీ.డీ.వో గంగా మోహన్, ఏ.పీ.ఎం. వసంత్, పంచాయతీ కార్యదర్శులు, బి.పి.ఎం లు పాల్గొన్నారు.

Next Story