- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం
భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా మండల కేంద్రంలోని కేకే గార్డెన్‌లో మల్రాజ్ రాంబాబు అధ్యక్షతన మండల సమావేశం ఏర్పాటు చేశారు.

దిశ, రెబ్బెన : భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా మండల కేంద్రంలోని కేకే గార్డెన్‌లో మల్రాజ్ రాంబాబు అధ్యక్షతన మండల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ బూత్ స్థాయిలో బలోపేతానికి నాయకులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్, కృష్ణకుమారి మాలిక్, సొల్లు లక్ష్మి, కేసరి ఆంజనేయులు గౌడ్, జిల్లా కార్యదర్శి నవీన్ గౌడ్, మాజీ మండలాధ్యక్షుడు గోలెం తిరుపతి, కుందారపు బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి సునార్కర్ తిరుపతి, మండల ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, దుర్గం శ్రీధర్, ఎర్ర రాజేష్, కార్యదర్శి రాజశేఖర్ తదితర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అలాగే మంగళవారం రెబ్బెన మండల కమిటీలో ఖాళీగా ఉన్న ఐదు పోస్టులను జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు అధ్యక్షతన ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శి-2గా సునార్కర్ తిరుపతి, ఉపాధ్యక్షులుగా కొయ్యడ మహేందర్ గౌడ్, దుర్గం శ్రీధర్, ఎర్ర రాజేష్, కార్యదర్శిగా రాజశేఖర్‌లను ప్రకటించారు.






