విద్యార్థిని వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

by Kodari Anjali |

తన కొడుకుని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైట్ చేశారు.

విద్యార్థిని వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
X

దిశ, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ హౌస్ మాస్టర్ తన పిల్లవాడిని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని 6వ తరగతి చదువుకుంటున్న మోహిత్ అనే విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. శనివారం ఈ మేరకు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యార్ధి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. గతకొంత కాలంగా స్కూల్‌లో తన పిల్లవాడిని హౌస్ మాస్టర్ అకారణంగా వివిధ పేర్లతో కామెంట్స్ చేయడంతో పాటుఇతర విద్యార్థులతో కొట్టిస్తున్నారని వాపోయాడు. ముందే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడని.. ఈ వేధింపులకు విద్యార్థి ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. హౌస్ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story