కోఆప్షన్ మెంబర్లుగా దివ్యాంగులకు అవకాశం కల్పించాలి : VHPS జాతీయ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ

by Ratna Kumari |

దిశ, మందమర్రి : మందమర్రి మండలం పులి మడుగు గ్రామంలో శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం

కోఆప్షన్ మెంబర్లుగా  దివ్యాంగులకు అవకాశం కల్పించాలి : VHPS జాతీయ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ
X

దిశ, మందమర్రి : మందమర్రి మండలం పులి మడుగు గ్రామంలో శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ముఖ్యఅతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ నూతనంగా ఎన్నిక కాబడిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వృద్దులు వితంతువులు, ఒంటరి మహిళలు వికలాంగులు చేయూత పెన్షన్ దారులు ఉన్నందున పంచాయతీ పరిధిలోని వారి సేవలు కొనసాగించుటకై వారికి పంచాయితీ పాలనలో వికలాంగులను కూడా భాగస్వామ్యం చేసి పంచాయతీ కోఆప్షన్ మెంబర్ లుగా అవకాశం కల్పించాలని నూతన సర్పంచులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు. కార్యక్రమంలో పాల్గొన్నVHPS నాయకులు మండల అధ్యక్షులు ఇందూరి రమేష్ ,బానోతు రాజు, బొద్దుల బుచ్చి రాజం, ధరావత్ రాందాస్, దురిశెట్టి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Next Story