మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

by Ratna Kumari |

దిశ‌, జైనూర్ : రైతులు పండించిన పంట‌ల‌కు క‌నీస మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించింద‌ని జైనూర్ వ్య‌వ‌సాయ మార్కెట్

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
X

దిశ‌, జైనూర్ : రైతులు పండించిన పంట‌ల‌కు క‌నీస మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించింద‌ని జైనూర్ వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ అన్నారు. శనివారం జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం గిడ్డంగుల వద్ద పాక్స్ చైర్మన్ కొడప హన్నుపటెల్ తో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అనుమతించిన గోదాములలో కనీస మద్దతు ధర కల్పించి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం క్వింటాల్ మొక్క జొన్న కు రూ. 2400 గిట్టుబాటు ధర చెల్లిస్తుంద‌ని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగించాలని కోరారు. రైతులు మొక్క జొన్న పంట ను 14 శాతం తేమ మించకుండా అర బెట్టి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, మార్క్ పేడ్ ప్రతినిధి నరేష్,ఏఈఓ మెస్రం రాము, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లింగు, కృష్ణ, ధర్మారావు, నాయకులు అబ్దుల్ ముఖీద్, ఇంటియాజ్ లాలా, మెస్రం అంబాజీ, మాజీ సర్పంచ్ లు మడావి భీమ్ రావు, రాహుల్, నాగోరావు, మెస్రం భూపతి, కనక గంగారం, పెందుర్ ప్రకాష్, సీఈఓ జనార్దన్ పాల్గొన్నారు.

Next Story