అప్పుడే ఎండ.. వెంట‌నే వాన‌.. అయోమ‌యంలో అన్న‌దాత‌లు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మామ‌డ : అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి పండించిన మొక్క‌జొన్న‌, సోయా పంట‌లు చేతికి వ‌చ్చే స‌మ‌యంలో అకాల వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో

అప్పుడే ఎండ.. వెంట‌నే వాన‌.. అయోమ‌యంలో అన్న‌దాత‌లు..!
X

దిశ‌, మామ‌డ : అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి పండించిన మొక్క‌జొన్న‌, సోయా పంట‌లు చేతికి వ‌చ్చే స‌మ‌యంలో అకాల వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో అన్న‌దాత‌లు ప‌డుతున్న బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతం అనే చెప్ప‌వ‌చ్చు. గ‌త కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కజొన్న పంట తడిసి ముద్దవుతుంది. రైతులు ప్రతిరోజు రోడ్డుకు ఇరువైపులా ఆరబెట్టిన మొక్కజొన్న వద్దే ఉంటూ టార్పాలిన్ కవర్లు కప్పి ఎండ వచ్చిన సమయంలో తీస్తున్నారు.మరల ఆకాశం లో మబ్బులు రావడంతో మళ్లీ మొక్కజొన్న వద్దకు వెళ్లి కవర్లు కప్పుతున్నారు.ఇలా నెలరోజుల నుంచి ఇదే దుస్థితి నెలకొంది. ఇప్పటికి 10 శాతం మంది మాత్రమే అమ్ముకున్నారు. మిగతా రోడ్లపైనే మొక్కజొన్నను ఆరబెట్టి నానా అవస్థలు పడుతున్నామని.. కళ్ళ లో నీళ్లు తిరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Next Story