రైలు నుంచి కిందపడి వ్య‌క్తికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |   (  Updated:2025-10-31 12:07:45  IST  )

దిశ, ఆసిఫాబాద్ : రైలు నుంచి కింద‌ప‌డి ఒక‌రికి తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న కాగ‌జ్ న‌గ‌ర్ రైల్వే పోలీస్ స్టేషన్ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్ పూర్ నుంచి త్రీపు

రైలు నుంచి కిందపడి వ్య‌క్తికి  తీవ్ర గాయాలు
X

దిశ, ఆసిఫాబాద్ : రైలు నుంచి కింద‌ప‌డి ఒక‌రికి తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న కాగ‌జ్ న‌గ‌ర్ రైల్వే పోలీస్ స్టేషన్ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్ పూర్ నుంచి త్రీపుర్ వెళ్తుండగా శుక్రవారం కాగజ్ నగర్ సిర్పూర్ టి మధ్య గల రైల్వే ట్రాక్ పై చందన్ కుమార్ (18) అనే యువకుడు రైలు నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో అతని తల, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆర్పీఎఫ్. జీఆర్పీ పోలీసులు గుర్తించి 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story