ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు

by Nallavelli.Anjaneyulu |

ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి.

ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు
X

దిశ, నేరడిగొండ, బోథ్ : ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా దయాల్ దన్నూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప‌లువురు రైతులు ఈనెల 10 న రాత్రి సమయంలో మొక్క జొన్న పంటకు నీరు అందించేందుకు పొలానికి వెళ్లారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న సర్వే నెం.89 వ్యవసాయ భూమిలో దత్త బలిరాం జాదవ్ (55) పై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామానికి చెందిన మరో 8 మంది రైతును కాపాడే ప్రయత్నంలో వారు సైతం దాడికి గురయ్యారు. ఈ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురిని నాందేడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి, ఒకరిని సంబాజీ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ డి గురుస్వామి మాట్లాడుతూ బోథ్ మండలంలోని సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతానికి వెళ్ళవద్దని సూచించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు ఏదైనా ప్రమాదం అనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

Next Story