- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీల్డ్ ట్రిప్ ద్వారా అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు : హర్టికల్చర్ ఆఫీసర్ సందీప్ కుమార్
దిశ, ఉట్నూర్ : విద్యార్థుల విజ్ఞాన యాత్ర (ఫీల్డ్ ట్రిప్)లో భాగంగా సందర్శనలో అనేక విషయాలు తెలుసుకోగలుగుతారనీ హర్టికల్చర్ ఆఫీసర్

దిశ, ఉట్నూర్ : విద్యార్థుల విజ్ఞాన యాత్ర (ఫీల్డ్ ట్రిప్)లో భాగంగా సందర్శనలో అనేక విషయాలు తెలుసుకోగలుగుతారనీ హర్టికల్చర్ ఆఫీసర్ సందీప్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉట్నూర్ లోని పట్టు పరిశ్రమ కేంద్రం, ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను సందర్శించారు. తొలుత పట్టు పరిశ్రమ కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులకు ఐటీడీఏ ఉద్యాన అధికారి సందీప్ కుమార్ వివిధ రకాల మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం పై అవగాహన కల్పించారు. రీలింగ్ యూనిట్ ని సందర్శించారు. పట్టుపురుగుల పెంపకం వలన రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఐటీడీఏ ఉద్యాన నర్సరీని సందర్శించిన విద్యార్థినులకు ఐటిడిఏ లోని వివిధ రకాల పండ్ల తోటల పెంపకం, సాగు విధానాలు, మొక్కలు తయారు చేసే విధానాలు, అంట్లు కట్టే విధానాలు వివరించారు. రైతులకు నాణ్యమైన మొక్కల యొక్క ఆవశ్యకతను తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడే విషయాల పట్ల అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రకాల పండ్ల తోటల గురించి తెలుసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనం తినే ఆహారాన్ని, రైతులను గౌరవించాలని, రైతులు ఆరుగాలం కష్టపడితేనే మనకు ఆహారం లభిస్తుందని, రైతుల గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. రోజువారి ఆహారంలో పండ్లు, కూరగాయల పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని, ఆరోగ్య సంరక్షణలో పండ్లు, కూరగాయలు ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు కీర్తన, అఖిల, దివ్య, ఉద్యాన సిబ్బంది అర్షిత, హిమబిందు, విద్యార్థినులు పాల్గొన్నారు.






