- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలి రోజే తేమ లొల్లి.. సీసీఐ పత్తి కోనుగోలుకు నిరాకరణ..!
దిశ, వాంకిడి : తేమ పేరుతో సీసీఐ కొర్రీలు పెడుతూ పత్తి కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ గురువారం వాంకిడి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఇ

దిశ, వాంకిడి : తేమ పేరుతో సీసీఐ కొర్రీలు పెడుతూ పత్తి కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ గురువారం వాంకిడి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పత్తి తడిసిందని.. దీంతో 15 నుంచి 20 శాతం తేమ ఉన్నా సీసీఐ పత్తి కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే తాము తీవ్ర నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ధర్నా విరమించాలని రైతులను కోరగా కలెక్టర్ వచ్చి పత్తి కొనుగోలుకు తమకు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. ఇదే క్రమంలో పోలీస్ రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దమ్ముంటే తమను అరెస్టు చేయాలని ఓ రైతు పోలీసులకు సవాల్ చేశాడు. దీంతో కాసేపు ఉధృతం నెలకొంది. తర్వాత స్థానిక రైతులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. రైతుల ధర్నాతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి. నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆ తరువాత పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.






