- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ రాయితీలతో ఊపందుకున్న ఆయిల్ పామ్ సాగు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1650 ఎకరాలు సాగులోకి వచ్చించి.

దిశ, రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1650 ఎకరాలు సాగులోకి వచ్చించి. దీని కోసం ఉద్యాన శాఖ ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనలు నిర్వహిస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించిన అనంతరం రైతులు ఆసక్తిగా సాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి అబ్దుల్ నదీమ్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అనేక రాయితీలను అందిస్తుంది.
రాయితీల వివరాలు..
మొక్కల సంరక్షణ, అంతర పంట సాగుకోసం ఎకరానికి 4 వేల చొప్పున నాలుగు సంవత్సరాల వరకు అందిస్తుంది. అలాగే మొక్క ఖరీదు 193 రూపాయలు కాగా దాదాపు 100% రాయితీని ఇస్తుంది. ఒక రైతు ఎన్ని ఎకరాలైన సాగుచేసానుకోవచ్చు, ఇందులో ఎలాంటి పరిమితి లేదు, అలాగే పంట సాగు కోసం బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) కోసం కూడా తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటి సేద్య పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీని కూడా అందిస్తుంది.
ఈ పంట నాటిన 4వ సంవత్సరం నుండి దిగుబడినినిస్తుంది. పంట కొనుగోలు కూడా సంబంధిత కంపెనీనే కొనుగోలు చేస్తుంది ఇది రైతు పంట వేసినప్పుడే రైతు నుండి అగ్రిమెంట్ కూడా చేసుకొని రైతుకు భరోసా కల్పిస్తారు. పంట ధర కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తారు. ఇప్పుడు టన్నుకు 21,500 వేలు ఉంది.
యం.ఎ.అబ్దుల్ నదీమ్ కుద్దుసి.. జిల్లా ఉద్యాన అధికారి...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1650 ఎకరాలు సాగులోకి వచ్చించి. దీని కోసం ఉద్యాన శాఖ తరఫున రైతులకు శిక్షణ కార్యక్రమాలు, క్షేత్రపర్యటనలు నిర్వహిస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించిన అనంతరం రైతులు ఆసక్తిగా సాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి అబ్దుల్ నదీమ్ తెలిపారు.






