వెట్టి చాకిరీ నుంచి విముక్తి

by Nallavelli.Anjaneyulu |

నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల్లో బందీలుగా చిక్కుకున్న కార్మికులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం బెంగాలీ క్యాంప్ నెంబర్ 12 పరిధిలోని ఇటుక బట్టీలపై జనవరి 31న అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

వెట్టి చాకిరీ నుంచి విముక్తి
X

దిశ, కాగజ్ నగర్ : నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల్లో బందీలుగా చిక్కుకున్న కార్మికులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం బెంగాలీ క్యాంప్ నెంబర్ 12 పరిధిలోని ఇటుక బట్టీలపై జనవరి 31న అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన పలువురు బాండెడ్ లేబర్లను (వెట్టి కార్మికులను) అధికారులు గుర్తించి రక్షించారు. రక్షించబడిన కార్మికులను ఆదివారం నాడు సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, లేబర్ ఆఫీసర్, కాగజ్ నగర్ తహసీల్దార్ మధుకర్ పర్యవేక్షణలో సురక్షితంగా వారి స్వగ్రామాలకు తరలించారు. కార్మికులను కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుండి కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో వారి సొంత జిల్లా అయిన ఒడిశాలోని బలంగిరికి పంపించారు. ఈ తరలింపు ప్రక్రియలో పోలీస్ సిబ్బంది రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్మికులను బందీలుగా ఉంచి వెట్టి చాకిరీ చేయించుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే ఇటుక బట్టీ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Next Story