- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ విధులకు ఆటంకం... ఏడుగురి పై కేసు నమోదు.
దిశ, బోథ్ : పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్టు గురువారం బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే.. బోథ్ మండలంలోని కంటేగామా,నిగినీ

దిశ, బోథ్ : పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్టు గురువారం బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే.. బోథ్ మండలంలోని కంటేగామా,నిగినీ గ్రామాలలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30న గుడుంబా విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఎస్సై శ్రీ సాయి సిబ్బందితో కలిసి పలువురి ఇండ్లలో రాత్రి సమయంలో తనిఖీలు నిర్వహించారు. నిగిని గ్రామంలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. సంజీవ్ అనే వ్యక్తి పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ గ్రామస్థులను రెచ్చగొట్టాడు. గ్రామానికి చెందిన పలువురు యువకులు ఎస్సైని చుట్టు ముట్టి కుడి చేతికి గాయపరిచి, ఓ మహిళా కానిస్టేబుల్ చేతిని పట్టుకున్నారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సంజీవ్, అంబిదాస్, జగదీష్, బీమా, సింఘియా, గణేష్, చేతన్ లపై కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.అయితే అంబిదాస్, జగదీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.






