- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > పదవుల కోసం కాదు.. పార్టీ కోసం కష్టపడతా : గ్రంథాలయ మాజీ చైర్మన్
పదవుల కోసం కాదు.. పార్టీ కోసం కష్టపడతా : గ్రంథాలయ మాజీ చైర్మన్
by Ratna Kumari |
దిశ, తాండూర్ : స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎంపిక పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి

X
దిశ, తాండూర్ : స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎంపిక పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తాను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరు కానీ పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఎప్పుడు కూడా పదవుల కోసం ఆరాటపడలేదని కేవలం పార్టీ బలోపేతం కోసం పాటుపడ్డమన్నారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపునకు కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Next Story






