టార్గెట్ చేసే ఉద్యమాలు వద్దు : ఎమ్మెల్యే బొజ్జ పటేల్

by Batti.Sumithra |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి ఉద్యమకారులు కొంత మంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారని, వ్యక్తులను టార్గెట్ చేసి ఉద్యమాలు చేయడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉద్యమకారులకు హితవు పలికారు.

టార్గెట్ చేసే ఉద్యమాలు వద్దు : ఎమ్మెల్యే బొజ్జ పటేల్
X

దిశ, ఉట్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి ఉద్యమకారులు కొంత మంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారని, వ్యక్తులను టార్గెట్ చేసి ఉద్యమాలు చేయడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉద్యమకారులకు హితవు పలికారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సన్నాహక సమావేశాన్ని ఆదివాసి పెద్దలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివాసులను ఉద్దేశించి మాట్లాడుతూ కొంతమంది ఉద్యమకారులు కొందరినీ టార్గెట్ చేసుకొని అమాయక ఆదివాసులను ముందుకు తీసుకువచ్చి ఉద్యమాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులు ఆదివాసుల సమస్యల పై ఉద్యమాలు చేయాలని ఈ సందర్భంగా సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తే అటవీ శాఖ అధికారులు ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని, ఆదివాసుల సమస్యలతో పాటు నిర్మాణాల పై అటవీ శాఖ పై ఎందుకు ఉద్యమాలు చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో పాటు ఆదివాసుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని, గత ఏడాది ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లో రహదారుల పరిస్థితిని గమనించి రూ .36 కోట్లు మంజూరు చేయించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మారుమూల గిరిజన గ్రామమైన హీరాపూర్ వస్తానని నిర్ణయించడం వల్ల ఇంద్రవెల్లి మండలంలోని అన్ని మారుమూల గ్రామాల ప్రజల సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోయం బాపూరావు మాట్లాడుతూ తనతో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను పిలిపించి హీరాపూర్ గ్రామంలో ఆదివాసి పటేళ్లు పెద్దలతో సమావేశం నిర్వహించి సమస్యలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తమకు చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి తేదీన నిర్ణయిస్తామని సోయం బాపురావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ఆదివాసులకు వివరించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పాలకవర్గం మాజీ చైర్మన్ సిడం అర్జు, రాయి సెంటర్ల జిల్లా మేడి పేందూరు అమృత్ రావు, సార్ మేడిలు వెంకట్రావు, సర్పంచ్ తులసము లక్ష్మీబాయి ల తో పాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, కొమురం భీం జిల్లా గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story