నిజాం నాటి స్ప్రింగ్ ఆనకట్టకు ఆదరణ కరువు

by Ratna Kumari |

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మత్తడి స్ప్రింగ్ గాని కట్టకు మరమ్మత్తులు కరువయ్యాయి. బెజ్జూరు మండల రైతులకు వరప్రసాదిని పేరొందిన మ‌త్త‌డి త్తడి స్ప్రింగ్ గాని నేడు ఇసుక నిండిపోవడంతో నీరు నిలవలేక పోతుంది.

నిజాం నాటి స్ప్రింగ్ ఆనకట్టకు ఆదరణ కరువు
X

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మత్తడి స్ప్రింగ్ గాని కట్టకు మరమ్మత్తులు కరువయ్యాయి. బెజ్జూరు మండల రైతులకు వరప్రసాదిని పేరొందిన మ‌త్త‌డి త్తడి స్ప్రింగ్ గాని నేడు ఇసుక నిండిపోవడంతో నీరు నిలవలేక పోతుంది. బెజ్జూరు శివారులోని సుమారు 790 ఎకరాలకు నీరు అందించాల‌నే ఉద్దేశంతో 1905 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం మత్తడి స్ప్రింగ్ గాని కట్ట నిర్మించింది. మత్తడి స్ప్రింగ్ గాని కట్ట వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుండేది. ఈ స్ప్రింగ్ గాని కట్ట వల్ల ఒక కాలువ పంట పొలాలకు, మరో కాలువ ప్రజల కోసం వాగులకు నీటిని వదులుతున్నారు. ఈ స్ప్రింగ్ గాని కట్టలో ఇసుక నిండి ఉండడంతో నీరు నిలవలేక పోతుంది. ముత్తడి వల్ల వస్తున్న నీరు వృధాగా పోతుంది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవ‌డంతో నీరు వృధాగా పోతుంది. మత్తడికట్ట లోపలి భాగంలో ఇసుక నిండి పోయింది. ఈ స్ప్రింగ్ గాని కట్ట వల్ల కాలువలను పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఈ స్ప్రింగ్ గాని కట్టలు ఇసుక నిండిపోవడం, కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల రైతుల ఇబ్బంది పడుతున్నారు. బెజ్జూర్ మండల కేంద్రం కి అత్తడి స్ప్రింగ్ గాని కట్ట సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. మండల కేంద్రానికి కూత వేట దూరంలో ఉన్న మ త్తడి స్ప్రింగ్ గాని కట్టపై నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. మత్తడి స్ప్రింగ్ గాని కట్టలోని ఇసుకను తొలగించి, కాలువలకు మరమ్మత్తులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ విషయమే కాగజ్ నగర్ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజయ్ ని సంప్రదించగా.. త్వరలో పరిశీలించి, స్ప్రింగ్ గాని కట్టకు అవసరమైన మరమ్మత్తుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.

Next Story