రేపు నిర్మల్ బంద్.. ఎమ్మెల్యే ఏలేటి పిలుపు

by Taduka Kalyani |   (  Updated:2026-03-27 16:09:12  IST  )

నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం బంద్ పిలుపు ఇచ్చినట్లు నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

రేపు నిర్మల్ బంద్.. ఎమ్మెల్యే ఏలేటి పిలుపు
X

దిశ ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం బంద్ పిలుపు ఇచ్చినట్లు నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ లో హిందువుల పై వరుస దాడులు జరుగుతున్నాయని, తాజాగా నిర్మల్ పిల్లల వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్ పైన దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. వీటిని నిరసిస్తూ శనివారం బంద్ కు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. డాక్టర్ సంతోష్ రాజ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంద్ కు అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజలు, స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చి బంద్ లో పాల్గొనాలని కోరారు.

Next Story