- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త కలెక్టర్ ఫస్ట్ టూర్ @ బాసర
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రా తన తొలి పర్యటన బాసరతో ప్రారంభించారు.

X
దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రా తన తొలి పర్యటన బాసరతో ప్రారంభించారు. ఆదివారం ఆయన తన సతీమణి ఇలా త్రిపాఠితో కలిసి బాసర సందర్శించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. తొలిసారిగా బాసర ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కలెక్టర్ ఆలయ పరిసరాలను పరిశీలించారు.
Next Story






