తెలంగాణ ఫార్మసీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నేరెళ్ల ప్రమోద్

by Batti.Sumithra |

తెలంగాణ ఫార్మసీ ( కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్)అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నేరెళ్ల ప్రమోద్ ఎన్నికయ్యారు.

తెలంగాణ ఫార్మసీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నేరెళ్ల ప్రమోద్
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : తెలంగాణ ఫార్మసీ ( కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్)అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నేరెళ్ల ప్రమోద్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో నిర్మల్ కు చెందిన ఫార్మసీ అసోసియేషన్ సీనియర్ నేత నేరెళ్ల ప్రమోద్ కు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అవకాశం దక్కింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా నేరెళ్ల ప్రమోద్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫార్మసీ దుకాణాల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. యజమానుల న్యాయపరమైన హక్కుల విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి వారికి అవసరం అయిన చేయూత అందిస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్త అసోసియేషన్ భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Next Story