రైతుల నిర్ల‌క్ష్యం.. వాహ‌న‌దారుడికి గాయం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, లోకేశ్వ‌రం : రైతుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓ వాహ‌న‌దారుడికి తీవ్ర గాయం చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పిప్రి గ్రామానికి చెందిన పాడిద

రైతుల నిర్ల‌క్ష్యం.. వాహ‌న‌దారుడికి గాయం..!
X

దిశ‌, లోకేశ్వ‌రం : రైతుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓ వాహ‌న‌దారుడికి తీవ్ర గాయం చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పిప్రి గ్రామానికి చెందిన పాడిద వినోద్ సోమవారం రాత్రి భార్య పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై లోకేశ్వరం నుండి పిప్రి గ్రామానికి వెళ్తున్నారు. నగర్ తాండా గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్ అనే రైతు లోకేశ్వరం - నందిపేట్ రోడ్డుపై మొహాల ఎక్స్ రోడ్డు సమీపంలో రోడ్డుపై మొక్కజొన్నలు ఆరబెట్టాడు. ఇక‌ రాత్రివేళ కనిపించ‌క‌పోవడంతో ద్విచక్ర వాహనం వాటిపై కి దూసుకెళ్లి అదుపు తప్పడంతో కింద పడగా వినోద్ కు గాయాలయ్యాయి. అతని భార్య లత ఫిర్యాదు మేరకు రైతు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రైతులు దయచేసి రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టొద్దు : ఎస్సై అశోక్

వ్యవసాయ ఉత్పత్తులు రోడ్ల పై ఆరబెట్టొద్దని పదే పదే చెబుతున్నా రైతులు వినిపించుకోవ‌డం లేదు. ఇలా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబానికి తీరని వ్యధ మిగులుతోంది. ఇకనైనా రైతులు దయచేసి రోడ్లపై వ్యవసాయ ఉత్పత్తులు ఆరబెట్టొద్దు. గాయాలైన సంఘటనల్లో పలువురు రైతులు బాధిత కుటుంబాలకు జరిమానాలు కూడా చెల్లించిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాదాలకు కారకులైన రైతులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.

Next Story