Collector inspection : నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

by Sridhar Babu |

అంగన్వాడీ కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, గర్భిణులకు, పిల్లలకు ప్రతిరోజూ తప్పకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు.

Collector inspection : నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
X

దిశ, ఆదిలాబాద్ : అంగన్వాడీ కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, గర్భిణులకు, పిల్లలకు ప్రతిరోజూ తప్పకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ లోగల అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి శనివారం నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు ఎంత మంది ఉన్నారు, వారి వివరాల హాజరు రిజిష్టర్ ను పరిశీలించారు.

అయితే అంగన్వాడీ టీచర్ రాక పోవడంతో సీడీపీఓ సూపర్ వైజర్ ను వెంటనే పిలిపించి అంగన్వాడీ టీచర్ ఎందుకు గైర్హాజర్ అయ్యారని అడిగి తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ఎంత మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇతర వివరాలతో కూడిన ఈ వారం రోజుల నివేదికను ఇవ్వాలని సీడీపీఓను ఆదేశించారు. అనంతరం ఏఎన్సీ రిజిష్టర్ పరిశీలించి, రిజిష్టర్ లో ఉన్న ప్రోఫార్మ ప్రకారం అన్ని కాలమ్స్ పూర్తి చేయాలని, ఐరన్ మాత్రలు, స్పాట్ ఫీడింగ్, కోడి గుడ్లు, పౌష్టికాహారం , హెల్త్ చెకప్ తదితరవి అందించాలని అన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలని తెలిపారు. ఇందులో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, డిప్యూటీ డీఎం హెచ్ ఓ సాధన, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్, సీడీపీఓ, తదితరులు ఉన్నారు.

Next Story