రవాణాశాఖకు జాతీయ రోడ్డు భద్రతా అవార్డు..

by Kodari Anjali |

ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

రవాణాశాఖకు జాతీయ రోడ్డు భద్రతా అవార్డు..
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రోడ్డు భద్రతపై చేపట్టిన వినూత్న కార్యక్రమాలకుగాను జిల్లాకు ‘జాతీయ రోడ్డు భద్రతా ఎక్సలెన్స్ అవార్డు–2026’ దక్కింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షాను రవాణా శాఖ అధికారులు కలిసి అభినందనలు అందుకున్నారు. కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రవీందర్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, ఎంవీఐ కె. హరీంద్ర కుమార్, అసిస్టెంట్ ఎంవీఐలు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం, డీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story