ప్రతిభ కనబపరిచిన నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు

by Ratna Kumari |   (  Updated:2025-10-03 11:44:53  IST  )

దిశ, జన్నారం : మండ‌ల కేంద్రానికి చెందిన నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు తమ ప్రతిభను మరోసారి

ప్రతిభ కనబపరిచిన నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు
X

దిశ, జన్నారం : మండ‌ల కేంద్రానికి చెందిన నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు తమ ప్రతిభను మరోసారి నిరూపించారు. ఈ కళాక్షేత్రానికి చెందిన విద్యార్థులు సహస్ర గౌడ్, యశోద వర్షిణి, యశోద మోక్షిత్ లు ఈటీవీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఢీ 20 రియాల్టీ డాన్స్ షోలో ఎంపికై అద్భుతమైన నృత్య ప్రదర్శన అందించారు. వారి ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందాయి. చిన్న వయసులోనే పెద్ద వేదికపై నిలబడి తమ ప్రతిభను చాటుకోవడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ నర్మద గౌడ్ మాట్లాడుతూ మా విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. జన్నారం నుంచి దేశ స్థాయిలో తమ ప్రతిభ చాటుకోవడం గర్వకారణం గా ఉంద‌ని.. భవిష్యత్తులో మరింత ఉన్నత వేదికలపై నిలబడతారని నమ్మకం ఉంది అని పేర్కొన్నారు. విద్యార్థుల విజయంపై స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.

Next Story