- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలుపు తిరిగిన మున్సిపల్ రాజకీయం.. కాంగ్రెస్ ఖాతాలోకి ఖానాపూర్ బల్దియా!
పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తయి రాష్ట్ర వ్యాప్తంగా పాలన సాగిస్తుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రెండు పురపాలక సంఘాల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి.

దిశ ప్రతినిధి, నిర్మల్: పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తయి రాష్ట్ర వ్యాప్తంగా పాలన సాగిస్తుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రెండు పురపాలక సంఘాల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్, మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి పురపాలక సంఘాల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నేడు జరగనున్నాయి ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
కాంగ్రెస్ ఖాతాలోకి ఖానాపూర్..
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘం అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరేలా కనిపిస్తున్నది. ఈ మేరకు రాజకీయ సమీకరణలు పూర్తిగా మారినట్లు స్పష్టం అవుతుంది. వాస్తవానికి అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ మున్సిపాలిటీలో మూడు కౌన్సిలర్ స్థానాలు మాత్రమే దక్కగా.. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సహకారంతో బలం నాలుగు కు చేరింది. బిజెపి నాలుగు స్థానాల్లో భారత్ రాష్ట్ర సమితి నాలుగు స్థానాల్లో గెలిచింది. అధికార పార్టీని నిలువరించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటయ్యి చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకునే దిశగా పావులుకదుపాయి. అయితే తాజాగా కారు పార్టీకి చెందిన మైస పోశవ్వ అనే కౌన్సిలర్ కిడ్నాప్ కు గురైందని ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తాజా పరిణామాలను బట్టి ఆ కౌన్సిలర్ అధికార పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ కూడా పరోక్షంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ లెక్కన మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యనారాయణ@ రాజురా సత్యం మరోసారి మున్సిపల్ చైర్మన్ గా గెలిచేందుకు మార్గం సుగమం అయినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సాకారంతో సత్యం చక్రం తిప్పి ఆ పదవిలో కూర్చునేందుకు అన్ని రకాల ప్లాన్ వేసినట్లు సమాచారం. ఒకవేళ పెద్ద ఎత్తున బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఒక సయోధ్యకు వస్తే మినహా ఖానాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక పై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు మంత్రి వివేక్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ సిపిఐ ఉమ్మడిగా అభ్యర్థిని బరిలోకి దించుతుండడంతో ప్రస్తుత సమీకరణాలు వారికి అనుకూలంగా ఉన్నట్లు తోస్తున్నది. ఒకవేళ రాజకీయ సమీకరణలు మారితే మినహా వాయిదా పడిన మున్సిపాలిటీల ఎన్నికలు నేడు సజావుగా సాగే అవకాశం ఉంది.






