ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

by Naveena |

మండలంలోని నక్కల్ వాడ,కరత్ వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రమేష్ మంగళవారం పరిశీలించారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
X

దిశ, బోథ్ : మండలంలోని నక్కల్ వాడ,కరత్ వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రమేష్ మంగళవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన కొలతలను పరిశీలించారు. ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ.. ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని, ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టిఏ లు చంద్రశేఖర్,మధుకర్, ఎస్ ఏ రాము పాల్గొన్నారు.

Next Story