- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీరనున్న తరోడా వంతెన కష్టాలు..
ఆదిలాబాద్ జిల్లతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు గత కొన్నేల్లుగా తరోడ వంతెన వద్ద పడుతున్న రాకపోకల ఇబ్బందులు ఎట్టకేలకు తొలగనున్నాయి.

దిశ, సాత్నాల : ఆదిలాబాద్ జిల్లతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు గత కొన్నేల్లుగా తరోడ వంతెన వద్ద పడుతున్న రాకపోకల ఇబ్బందులు ఎట్టకేలకు తొలగనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న నూతన బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ 12 కోట్లతో నిర్మించే తరోడ బ్రిడ్జి నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తరోడా పాత వంతెన బీటలు వారి కూల్చివేయగ, అదే స్థానంలో పూర్తి కేంద్ర ప్రభుత్వం నిధులు 12 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఇటీవల జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా వంతెన నిర్మాణ పనులు ఆలస్యంగా మొదలు పెట్టాల్సి వచ్చిందని. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భవిష్యత్తులో ఈ జాతీయ రహదారిని ఫోర్ లైన్ రహదారిగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ నూతన వంతెన నిర్మాణ పనులు రానున్న మే మాసంలోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు గజానంద్, కరుణాకర్ రెడ్డి, విజయ్ అశోక్ రెడ్డి సన్నీ రాజు, అధికారులు పాల్గొన్నారు.






