ప్ర‌తీ ఒక్క‌రూ ఆధ్యాత్మిక మార్గంలో న‌డుచుకోవాలి : ఎంపీ న‌గేష్

by Ratna Kumari |   (  Updated:2025-10-11 13:04:21  IST  )

Everyone should follow the spiritual path: MP Nagesh

ప్ర‌తీ ఒక్క‌రూ ఆధ్యాత్మిక మార్గంలో న‌డుచుకోవాలి : ఎంపీ న‌గేష్
X

దిశ, తలమడుగు : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలని ఎంపీ గోడం నాగేష్ అన్నారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు ఎంపీతో పాటు ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ స్థానిక సంస్థలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కేదరేశ్వర్ రెడ్డి, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి, సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, చంద్రకాంత్, రాజు, వెంకటస్వామి, మహేందర్ యాదవ్, పాయల్ జ్ఞానేశ్వర్, భుజంగరావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Next Story