రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఎంపీ, ఎమ్మెల్యే విఫ‌లం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-01 09:38:23  IST  )

దిశ, ఆదిలాబాద్ : కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌కు జ‌రిగిన న‌ష్ట‌ప‌రిహారం పై వ‌ర్షాభావ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని మాజీ మంత్రి జోగు రామ‌న్న డిమాండ్ చేశారు. శ‌నివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఎంపీ, ఎమ్మెల్యే విఫ‌లం
X

దిశ, ఆదిలాబాద్ : కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌కు జ‌రిగిన న‌ష్ట‌ప‌రిహారం పై వ‌ర్షాభావ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని మాజీ మంత్రి జోగు రామ‌న్న డిమాండ్ చేశారు. శ‌నివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ రైతు నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకు పోవడంలో విఫలం అవుతున్నారన్నారు. గత కొంత కాలంగా రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొని ఆర్థిక నష్టాలతో రబీ పంటకు పెట్టుబడి లేక, రైతులకు అందించాల్సిన నష్ట పరిహారాన్ని సైతం అందించలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం తగదన్నారు. రైతులు పత్తి అమ్మేందుకు మార్కెట్ కు వచ్చిన మైచర్ సాకుతో మార్కెట్ లోనే మూడు, నాలుగు రోజులు వేచి ఉండేలా చేయడం తగదన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారాన్ని అందించాలని.. లేకుంటే ఉద్యమానికి తెరలేపుతామన్నారు. కార్యక్రమంలో రావుత్ మనోహర్, యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, సేవ్వ జగదీష్ పాల్గొన్నారు.

Next Story