- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షణికావేశంలో తల్లి మృతి..దీనావస్తలో చిన్నారులు
దిశ, ఉట్నూర్ : అమ్మ లే ఆకలి అవుతుంది.. అంటూ ఆ చిన్నారులు ఏడుస్తూ కనిపించిన దృశ్యం అందరి హృదయాలను కలచివేసింది. క్షణికావేశంలో ఆ చిన్నారుల తల్లి మృతి చెందడంతో

దిశ, ఉట్నూర్ : అమ్మ లే ఆకలి అవుతుంది.. అంటూ ఆ చిన్నారులు ఏడుస్తూ కనిపించిన దృశ్యం అందరి హృదయాలను కలచివేసింది. క్షణికావేశంలో ఆ చిన్నారుల తల్లి మృతి చెందడంతో దీనావస్తలో ఉన్న ఘటన బుధవారం రాత్రి ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిర్సాయిపేట మొతిరాం గూడ కు చెందిన మంగం భీమ్రావ్ కూతురు రజిత (27), లింగాపూర్ మండలంలోని మాన్కుగూడ కు చెందిన సుదర్శన్ కి ఐదేళ్ల క్రితం సాంప్రదాయ ప్రకారం.. పెళ్లి జరిగింది. వీరి జీవితంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం అయిన 6నెలల నుంచి సుదర్శన్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొవడం వల్ల భార్య రజితతో తరుచూ గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పంచాయతీ పెట్టినప్పటికీ ఆయన తీరు మార్చుకోలేదు. అదే విధంగా సుదర్శన్ రోజు తాగి వచ్చి గొడవలు చేస్తుండడంతో పాటు నువ్వు చనిపోతే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడని దీని వల్ల మృతురాలు తీవ్ర మనస్తాపం చెందేది. ఈ సమయంలో సుదర్శన్ బుధవారం మృతురాలితో గొడవపడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ ఇంటికి తీసుకెళ్లాలని చెప్పగా రజిత తమ్ముడు రవి బైక్ పై తిరిగి రాత్రి తల్లిగారి ఇంటికి వస్తున్న మండలంలోని ఘన్ పూర్ గ్రామం రాగానే మృతురాలు బైక్ పై నుంచి కిందికి దూకి అడవిలోకి వెళ్ళి క్షణికావేశంతో చున్నీతో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహంను అప్పగించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తల్లి మృతి చెందిన విషయం తెలియక ఆ చిన్నారులు తల్లడిల్లడంతో అందరి హృదయాలను కలచివేసింది. తల్లి కోసం ఆరాటపడుతున్న పడుతున్న పసి హృదయాలను చూసి చూసిన ప్రజలు కంటతడి పెట్టుకున్నారు.






