త‌ల్లి, కొడుకు అదృశ్యం

by Ratna Kumari |

త‌ల్లి, కొడుకు అదృశ్య‌మైన సంఘ‌ట‌న బెజ్జూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

త‌ల్లి, కొడుకు అదృశ్యం
X

దిశ, బెజ్జూర్ : త‌ల్లి, కొడుకు అదృశ్య‌మైన సంఘ‌ట‌న బెజ్జూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. మ‌హారాష్ట్ర లోని గ‌డ్చిరోలి జిల్లా, అహ‌రి గ్రామానికి చెందిన దూడ మ‌ల్లెష్ పెద్ద కూతురు బెజ్జూర్ మండ‌లం స‌లుగుపల్లిలో నివ‌సిస్తోంది. స‌ల‌గుప‌ల్లి గ్రామానికి చెందిన బండి సుజాత‌(45), త‌న కుమారుడు బండి శ్రావ‌ణ్ కుమార్ (12) జ‌న‌వ‌రి 2న అహ‌రి గ్రామం నుంచి స‌లగుప‌ల్లి వెళ్లేందుకు బ‌య‌లుదేరింది. అప్ప‌టి నుంచి ఆమె స‌ల‌గుప‌ల్లికి చేరుకోలేదు. కుటుంబ స‌భ్యులు వెతికినా ఆచూకి ల‌భించ‌లేదు. దీంతో తండ్రి దూడ మ‌ల్లేష్ బెజ్జూర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాడు. వారి ఆచూకి తెలిస్తే.. వెంట‌నే సీఐ సంతోష్ కుమార్ 8712670512 , ఎస్సై పాషా 8712670541కి స‌మాచారం అందించాల‌ని కోరారు.

Next Story