సీఎం స‌హాయనిధి ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు మేలు : ఎమ్మెల్సీ దండే విఠల్

by Ratna Kumari |

దిశ, కాగజ్ నగర్ : సీఎం స‌హాయ‌నిధి ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంద‌ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బుధవారం కాగజ్ నగర్ పట్టణంలోని ఆయన

సీఎం స‌హాయనిధి ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు మేలు :  ఎమ్మెల్సీ దండే విఠల్
X

దిశ, కాగజ్ నగర్ : సీఎం స‌హాయ‌నిధి ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంద‌ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బుధవారం కాగజ్ నగర్ పట్టణంలోని ఆయన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యంగా పెంచికలపేట్ గ్రామానికి చెందిన సుంకరి భాగ్య, కాగజ్ నగర్ కు చెందిన పోతరాజుల కవితలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ దండే విఠల్ అంద‌జేశారు. ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ఈ సహాయాన్ని అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ దండె విఠ‌ల్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా వేలాది మంది పేద ప్రజలు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది గొప్ప ఆసరాగా నిలుస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వైద్య సహాయం అవసరమైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తన కార్యాలయం ద్వారా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Next Story