- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్టంలో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
దిశ, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్

దిశ, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఆస్ట్రోనామీ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వెడ్మాబొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ శనివారం ఆస్ట్రోనామీ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే విద్యార్థులందరికీ మంచి విద్య అందుతుందని అన్నారు. మస్కాపూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల పరీక్ష ఫలితాలతో పాటు, అన్ని రంగాలలో ముందు నిలవడం సంతోషకరమైన విషయమని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించేలా జిల్లాలో పలు పాఠశాలల్లో ఆస్ట్రానమీ ల్యాబ్ లను ప్రారంభించామని అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు . విద్యార్థుల్లో సైన్స్ పట్ల పరిజ్ఞానం పెరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను గమనించి, వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని అన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో మరింత మంచి ఫలితాలు సాధించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను ఆ దిశగా సన్నద్ధం చేయాలని వఅన్నారు .ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఇందుకుగాను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద మౌలిక సదుపాయాల కల్పన చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో మస్కాపూర్ పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశామని, అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంచి ఫలితాలు సాధించేలా విశేష కృషి చేస్తున్న పాఠశాల విద్యార్థులకు, సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఐఐటి మద్రాస్ వారిచే 10 విభాగాల్లో 35 మంది విద్యార్థులు పాలుపంచుకొని, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 31 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పీఎం శ్రీ కింద మంజూరైన 50 వేల రూపాయలతో సమకూర్చిన ఆట వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న, వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనికేని దయానంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజుల సత్యం, డీఈవో భోజన్న, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ప్రధానోపాధ్యాయుడు బోనగిరి నరేందర్ రావు, ఉపాధ్యాయులు అంజయ్య, శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






