- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. రక్తపు మరకలతో ఆస్పత్రిలో చేరిక
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. రక్తపు మరకలతో ఆస్పత్రిలో చేరిక
by Kodari Anjali |
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు పెను ప్రమాదం తప్పింది. బోథ్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుకు శనివారం నేరడిగొండ మండల కేంద్రంలోని కొరటికల్ కార్నల్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు భాగం ధ్వంసం అయింది. ఐతే ప్రమాదంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు క్షేమంగా బయటపడ్డారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారుకు ఆవు అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న ఎమ్మెల్యే, ఇతరులను బోథ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






