- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తి కొనుగోలు చేసినట్టు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పాయల్ శంకర్
దిశ, ఆదిలాబాద్ : గతంలో ఉన్న ప్రభుత్వాలు 20 శాతం తేమతో పత్తి కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే.. తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆయన

దిశ, ఆదిలాబాద్ : గతంలో ఉన్న ప్రభుత్వాలు 20 శాతం తేమతో పత్తి కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే.. తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. కేటీఆర్ రైతు సమస్యలపై ఆదిలాబాద్ కు వచ్చి.. బీజేపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖలు చేయడం సరి కాదన్నారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతులను పట్టించుకోలేదని.. ఇప్పుడు అధికారం పోయాక రైతుల పక్షాన పోరాడుతామని ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చి.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలచే రైతుల ముసుగులో మాట్లాడించి..కేంద్రం, సీసీఐపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక వారి మెదడులు పని చేయడం లేదన్నారు. సీసీఐ నిబంధనలు గత 12 ఏళ్లుగా ఉన్నవే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని అందులో ఎలాంటి మార్పు లేదన్నారు.ఆదిలాబాద్ నుంచి టెక్స్ టైల్ పార్కు ఇతర జిల్లాకు పోతుంటే..గతంలో మాట్లాడని జోగురామన్న ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని అన్నారు.బీఆర్ఎస్ చేసిన పాపాల గురించి సొంత చెల్లి అయినా కల్వకుంట్ల కవితనే బయటపెడుతుందని అది తెలుసుకోవాలన్నారు. నాయకులు బంతి పెళ్లి దయాకర్, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.






