- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎకరానికి 10 క్వింటాళ్ల సోయా కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
దిశ, ఆదిలాబాద్ : రైతులు పండించిన సోయా పంటను ఎకరానికి 7.6 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నారని,దాన్ని 10 క్వింటాలు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ

దిశ, ఆదిలాబాద్ : రైతులు పండించిన సోయా పంటను ఎకరానికి 7.6 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నారని,దాన్ని 10 క్వింటాలు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం సోయా కొనుగోలు కేంద్రాన్నీ ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా కొనుగోళ్లను ఎకరానికి పది క్వింటాలకు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి రైతుల సమస్యలను విన్నవించారు.రైతుల సమస్యలను మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ పంటలను ప్రభుత్వాలు మద్దత్తు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.గతంలో అధికారంలో ఉన్న నాయకులు అప్పుడు రైతులను పట్టించుకోలేదని,ఇప్పుడు రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ అడ్డి బోజారెడ్డి,మార్కెట్ అధికారి ప్రవీణ్,నాయకులు దయాకర్,అశోక్ రెడ్డి,లాలామున్నా పాల్గొన్నారు.






