స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలి : ఎమ్మెల్యే ప‌వార్ ప‌టేల్

by Ratna Kumari |

దిశ‌, భైంసా : నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు, పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించి అందరి అభిప్రాయం మేరకే బీజేపీ అభ్యర్థులను ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలి : ఎమ్మెల్యే ప‌వార్ ప‌టేల్
X

దిశ‌, భైంసా : నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు, పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించి అందరి అభిప్రాయం మేరకే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేస్తామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో బాసర, లోకేశ్వరం, ముధోల్, తానూర్ మండలాల బీజేపీ నాయకులతో వేర్వేరు గా సమావేశాలు ఏర్పాటు చేసిమాట్లాడారు. కలిసి కట్టుగా ఉండి అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ తప్పకుండా గుర్తింపు ఇస్తుందన్నారు. నియోజవర్గం లోని అన్ని జ‌డ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి మండలానికి జ‌డ్పీటీసీ అభ్యర్థులు ముగ్గురు చొప్పున ఖరారు చేసి పంపించడం జరుగుతుందని.. అలాగే ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక తీరు అలాగే ఉంటుందన్నారు. సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకు టికెట్లు ఖరారు చేస్తామన్నారు.

Next Story