ఉద్యమ కళాకారుల పోరు దీక్షకు ఎమ్మెల్యే హరీష్ బాబు సంపూర్ణ మద్దతు

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ (ధర్నా చౌక్) వద్ద నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష కు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తన పూర్తి మద్దతు ప్రకటించారు.

ఉద్యమ కళాకారుల పోరు దీక్షకు ఎమ్మెల్యే హరీష్ బాబు సంపూర్ణ మద్దతు
X

దిశ, కాగజ్ నగర్ : తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ (ధర్నా చౌక్) వద్ద నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష కు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తన పూర్తి మద్దతు ప్రకటించారు. గురువారం కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఉద్యమ కళాకారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చలో ఇందిరా పార్క్ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించి, వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. నాడు తమ ఆటపాటలతో ఊరూరా ఉద్యమ జ్వాలను రగిలించిన కళాకారులు, నేడు తమ ఉపాధి కోసం రోడ్డెక్కడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా కళాకారుల సంక్షేమాన్ని పాలకులు విస్మరించారని, ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం స్పందించి ఉద్యమ కళాకారులకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కళాకారుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని, అసెంబ్లీలోనూ వారి గళాన్ని వినిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారులు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్, పవన్, ప్రభాకర్, సమ్మక్క పాల్గొన్నారు.

Next Story