ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య .. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

by Disha Web Desk 20 |
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య .. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
X

దిశ, తాండూర్ : ప్రభుత్వ పాఠశాలలో వెనుకబడిన జాతులు, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గురువారం తాండూర్, రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూర్ జెడ్పీ హెచ్ ఎస్ కు రూ. 35 లక్షలు, రేచిని జెడ్పీ హెచ్ ఎస్ కు రూ. 85 లక్షలు నిధులను పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాలను తీర్చిదిద్ది నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. అనంతరం మహిళలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు నవీన్ కుమార్, దుర్గుబాయి, ఎంపీపీ ప్రణయ్ కుమార్, జెడ్పీటీసీ బానయ్య, ఆర్ఆర్ఎస్ అధ్యక్షుడు దత్తాత్రేయరావు, పీఎసీఎస్ చైర్మన్ దత్తమూర్తి, ఎంపీటీసీలు సిరంగి శంకర్, పెర్క రజిత, మొగిలి శంకర్, కోఆప్షన్ మెంబర్ నజీఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంజిత్, ఎంఈఓ ప్రభాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed